కరోనా వైరస్ కట్టడికి దేశీయంగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న ‘కొవాగ్జిన్’ టీకాపై ఆ సంస్థ శుభవార్త చెప్పింది. కొవాగ్జిన్ టీకా ఎలాంటి ప్రతికూల ప్రభావాల్ని చూపడం లేదని వెల్లడించింది. తొలి దశ ట్రయల్స్‌కు సంబంధించి మధ్యంతర ఫలితాల్ని బుధవారం విడుదల చేసింది.
‘టీకా తొలి వ్యాక్సినేషన్ తర్వాత తలెత్తిన దుష్ప్రభావాలు ఎలాంటి మందుల అవసరం లేకుండానే తగ్గిపోయాయి. ఒక ప్రతికూల విషయం ఏంటంటే... ఇంజక్షన్ వేసిన చోట నొప్పి ఏర్పడుతోంది. అదీ క్రమంగా తగ్గింది. ఫేజ్ 1 ట్రయల్స్ మధ్యంతర ఫలితాల ప్రకారం.. టీకా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడమే కాక, ఎలాంటి ప్రతికూల ప్రభావాల్ని చూపలేదు’ అని భారత్ బయోటెక్ పేర్కొంది.