తెలంగాణ

telangana

ETV Bharat / state

Rapido issue: ర్యాపిడో ప్రకటనను ప్రసారం చేయకుండా నిలిపివేయాలని కోర్టు ఆదేశం

బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో ప్రకటనలో ఆర్టీసీ బస్సును తొలగించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజారవాణా బస్సులను తక్కువ చేసి చూపించరాదంటూ తెలిపింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన వాణిజ్య ప్రకటనను ప్రసారం చేయకుండా నిలిపేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Rapido ad
బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో

By

Published : Dec 5, 2021, 8:53 PM IST

ర్యాపిడో ప్రకటనలో ఆర్టీసీ బస్సులను తక్కువ చేసి చూపించడాన్ని నాంపల్లి కోర్టు తప్పుపట్టింది. ప్రజా రవాణా పరువును దెబ్బతీసేలా ఉన్న ఆ ప్రకటనలో ఆర్టీసీని తొలగించాలని ర్యాపిడోతో పాటు గూగూల్, యూట్యూబ్‌లను కోర్టు ఆదేశించింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో వాణిజ్య ప్రకటనపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రకటనను ప్రసారం చేయకుండా నిలిపేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. గత నెల రోజులుగా ర్యాపిడో విస్తృతంగా ప్రకటనను ప్రసారం చేస్తోంది.

వీడియోను బ్లాక్ చేయండి

ఈనెల 3వ తేదీన ర్యాపిడో కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో పాటు, టీఎస్‌ఆర్టీసీ పరువు నష్టానికి సంబంధించిన విషయాలపై విచారణ జరిగింది. ఈ సందర్బంగా వాణిజ్య వీడియోను బ్లాక్ చేయాలని యూట్యూబ్‌ను ఆదేశించింది. ఈ ప్రకటనలో టీఎస్ఆర్టీసీ బస్సును నేరుగా చూపించింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు జారీ చేశాక ప్రకటనను కొద్దిగా సవరించినా.. టీఎస్ఆర్టీసీ బస్సును ప్రదర్శించడం కొనసాగించింది.

కోర్టును ఆశ్రయించిన టీఎస్‌ఆర్టీసీ

వివిధ ఛానెల్స్‌లో, యూట్యూబ్‌లో ప్రకటన ప్రసారం చేయడాన్ని నిలిపివేయడానికి ర్యాపిడో నిరాకరించడంతో టీఎస్ఆర్టీసీ కోర్టును ఆశ్రయించింది. ర్యాపిడో వాటి సేవలను ప్రోత్సహించడానికి కచ్చితంగా అర్హత కలిగి ఉన్నప్పటికీ.. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీకి పరువు నష్టం కలిగించే విధంగా ప్రకటనలు చేయడం తగదని సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి వాదించారు. వాదనలు విన్న కోర్టు పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని ర్యాపిడోను ఆదేశించింది. అలాగే, యూట్యూబ్ తన ప్లాట్‌ఫాం నుంచి ప్రకటన చిత్రాలను తీసివేయాలని కూడా సూచించింది. సంస్థను సామాజిక ఆస్తిగా భావించడమే కాక ప్రతి ఒక్కరూ ఆదరించాలే తప్ప.. సంస్థ ప్రతిష్టకు భంగం కల్గించకూడదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details