తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని శాసనమండలి కార్యాలయం ప్రాంగణంలో హరితహారం సందడిగా సాగింది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విప్‌లు కర్నె ప్రభాకర్, బోడగుండి వెంకటేశ్వర్లు, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు.అభివృద్ధి, సంక్షేమ, భాగ్యనగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఐటీ రంగంలో 1.25 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు వంటి అంశాల్లో కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారని గుత్తా అన్నారు. తెలంగాణ ప్రజానీకం, ప్రజాప్రతిధులతో మమేకమై ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన వంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు: గుత్తా - hyderabad latest news
గత ఆరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని శాసన మండలి కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.
కేటీఆర్... ఐటీ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకురావడం ద్వారా యూత్ ఐకాన్‌గా నిలిచారని విప్ బోడిగుండి వెంకటేశ్వర్లు ప్రశంసించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావు మొదలు పెట్టిన "గ్రీన్ ఛాలెంజ్" స్వీకరించిన తాను మూడు మొక్కలు నాటానని... తాను మరో నలుగురికి సవాల్ విసురుతున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు మొక్కలు నాటడం, కరోనా బాధితులకు సహాయం అందించడంలో నిమగ్నమయ్యారని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.