తెలంగాణ

telangana

ETV Bharat / state

Stamps and Registration Dept in TS: బదిలీలు లేవు​.. ఎన్నో ఏళ్లుగా ఒకేచోట తిష్ట.. నిబంధనలు బేఖాతర్​! - telangana news latest

రిజిస్ట్రేషన్ శాఖలో (Stamps and Registration Dept ) ప్రభుత్వ శాఖలకు భిన్నంగా పరిపాలన సాగుతోంది. కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసి అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు. నియమ నిబంధనలు తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్లు చెయ్యడంలో.. వక్రభాష్యం చెప్పడంలో ఆరితేరినారు కొందరు సబ్ రిజిష్ట్రార్లు.

Stamps and Registration Dept in TS
Stamps and Registration Dept in TS

By

Published : Oct 18, 2021, 10:38 AM IST

ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్లకు ఓసారి బదిలీలు సర్వసాధారణం. రిజిస్ట్రేషన్ శాఖ(Stamps and Registration Dept )కు మాత్రం ఆ నిబంధన వర్తించదు. ఈ శాఖలో పలువురు సబ్ రిజిస్ట్రార్లు 9, 10 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. తెలంగాణ ఖజానాకు ఎక్కువు రాబడి తేచ్చే శాఖల్లో ఇది ఒకటి. ఇందులో కొందరు అధికారులు ఏళ్ల తరబడి తిష్ట వేశారు. ఉంటే సబ్ రిజిస్టార్లుగా... లేదంటే ఇంఛార్జీగా విధులు చక్కబెడుతున్నారు. కొందరైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి బదిలీ మాట లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు. ఆరోపణలు ఉన్నా... సస్పెండ్ అయినా... ఇలాంటి వారిలో కొందరికి తమ స్థానాలకు ఎలాంటి డోకా ఉండదు.

ఎన్నో ఏళ్లుగా తిష్ట

రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలో పలువురు సబ్ రిజిష్ట్రార్లు 5 ఏళ్లకు పైగా ఓకే చోట విధులు నిర్వహిస్తున్నారు. ఏసీబీకి పట్టుబడుతున్న అధికారుల్లో సబ్​రిజిస్టార్లు ఎక్కువగానే ఉంటున్నారు. కొందరైతే 13 ఏళ్లుగా ఒకేచోట వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులున్నా... వాటిని సైతం కొందరు ఖాతరు చేయడం లేదు. నిబంధనల ఉల్లంఘనలో కొందరు దిట్టలు. వాటికి వక్ర భాష్యం చెప్పడంలో మరికొందరు ఘనులు.

పైసలిస్తేనే ప్రసన్నం

వరంగల్​లో ఖిలావరంగల్ సబ్ రిజిస్టర్ 13 ఏళ్లుగా ఒకేచోట ఉన్నారు. ఇదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్​గా ఐదేళ్లు పని చేశారు. ములుగు సబ్ రిజిష్ట్రార్ పదేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిష్ట్రార్ 2008 నుంచి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నారాయణపేట సబ్ రిజిస్టార్ 2015 నుంచి, మధిర సబ్ రిజిస్ట్రార్ 9 ఏళ్లుగా, భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ ఏడేళ్లుగా, వైరా సబ్ రిజిస్ట్రార్ ఏడున్నర ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. ఖమ్మంలో మరో ఇద్దరు సబ్ రిజిస్టార్ ఎనిమిదేళ్లుగా... ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. చేర్యాల సబ్ రిజిస్ట్రార్ ఎనిమిదేళ్లుగా, సిద్దిపేట గ్రామీణ సబ్ రిజిస్ట్రార్ ఏడేళ్లుగా, తూప్రాన్​ సబ్ రిజిస్ట్రార్ నాలుగేళ్లుగా బదిలీలకు దూరంగా ఉన్నారు. అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే సంగారెడ్డిలో ఒక సబ్ రిజిస్ట్రార్ నాలుగేళ్లుగా పని చేస్తున్నారు.

ప్రక్షాళన జరిగితేనే...

రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్​ల కొరత ఉండడంతో కొన్ని సంవత్సరాలుగా జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు... ఇంఛార్జీ సబ్ రిజిస్ట్రార్లుగా రాజ్యమేలుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువ. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్​ రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. బోధ్​​, నర్సాపూర్ కార్యాలయంలోనూ మూడేళ్లుగా ఇదే పరిస్థితి. పాత నిజామాబాద్ జిల్లా పరిధి ఎల్లారెడ్డి, బీచ్కొండ, బాన్సువాడ, భీంగల్​, నిజామాబాద్​ గ్రామీణ సబ్ రిజిస్ట్రార్లుగా సీనియర్ అసిస్టెంట్​లు పనిచేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని మాల్యాల, మెట్​పల్లి కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోనూ జూనియర్ అసిస్టెంట్ ఇంఛార్జీ కొనసాగుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పునర్​ వ్యవస్థీకరణ జరిగి ప్రక్షాళన జరిగితే కానీ పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు.

ఇదీ చదవండి :Corona Vaccination in Telangana : 100 శాతం కరోనా టీకాకు పక్కా ప్రణాళిక

ABOUT THE AUTHOR

...view details