పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో అపోలో ఆసుపత్రుల గ్రూపు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ సౌందర రాజన్, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వైద్య ఆరోగ్య సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు గవర్నర్.
ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద సంక్షేమ పథకమని.. ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణలో భాగంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గర్భిణులకు కేసీఆర్ కిట్లు, ఆరోగ్య శ్రీ వంటి మెరుగైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ డా.ప్రతాప్ సీ రెడ్డి, వైస్ ఛైర్మన్ శోభన, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలి: తమిళిసై - గవర్నర్ డా. తమిళసై సౌందర రాజన్
ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురాలని గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలంతా వినియోగించాలని గవర్నర్ సూచించారు.
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలంతా వినియోగించాలి : గవర్నర్ తమిళసై
ఇవీ చూడండి : రెండ్రోజుల్లో నూతన మద్యం విధానానికి గ్రీన్ సిగ్నల్!