తెలంగాణ

telangana

ETV Bharat / state

చికెన్, గుడ్లతో ఆరోగ్యం.. అందరూ తినండి: మంత్రి కేటీఆర్ - మంత్రి కేటీఆర్‌

చికెన్‌పై వస్తున్న దుష్ప్రచారాలు, అపోహలు అవాస్తవమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చికెన్‌ తినడం వల్ల ఎలాంటి హానీ లేదని ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కరోనా వైరస్‌కు చికెన్‌, గుడ్లకు ఎలాంటి సంబంధం లేదని సూచించారు.

Coronavirus virus has nothing to do with chicken and eggs minister ktr
చికెన్‌ తినడం వల్ల ఎలాంటి హానీ లేదు : మంత్రి కేటీఆర్‌

By

Published : Feb 28, 2020, 8:24 PM IST

రాష్ట్రంలో చికెన్‌ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన ఘటనలు లేవని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. చికెన్‌పై వస్తున్న దుష్ప్రచారాలు, అపోహలు అవాస్తవమన్నారు. కరోనా వైరస్‌కు చికెన్‌, గుడ్లకు ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు సూచించారు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద చేసే వంటల వల్ల ఎలాంటి జబ్బులు రావని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమకు రాజధానిగా తెలంగాణ నిలుస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పరిశ్రమకు ప్రభుత్వం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ పెద్దఎత్తున ఉపాధిని కల్పిస్తూ రైతులకు బాసటగా నిలుస్తోందని పేర్కొన్నారు. మొక్కజొన్న రైతులకు కూడా పౌల్ట్రీ రంగం అండగా నిలుస్తోందన్నారు. పలు రంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. వసతిగృహాల్లో విద్యార్థులకు సైతం ప్రభుత్వం చికెన్‌, గుడ్లను పంపిణీ చేస్తోందని వెల్లడించారు.

చికెన్‌ తినడం వల్ల ఎలాంటి హానీ లేదు : మంత్రి కేటీఆర్‌

ఇదీ చూడండి :కరోనా వైరస్‌కు చికెన్‌కు సంబంధం లేదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details