హైదరాబాద్ ముషీరాబాద్‌లో కరోనా కేసుల పరంపర కొనసాగుతోంది. రాంనగర్లో ఇటీవల కరోనాతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబంలో మొత్తం 13 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల నియోజకవర్గంలో కేసుల సంఖ్య 100కు చేరువలో కరోనా కేసులు ఉన్నట్లు తెలిపారు.
ముషీరాబాద్‌లో వందకు చేరువలో కరోనా కేసులు
ముషీరాబాద్‌లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటినుంచి భారీగా కేసులు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో కరోనా కేసులు సంఖ్య వందకు చేరువలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ముషీరాబాద్‌లో వందకు చేరువలో కరోనా కేసులు
ఇటీవల 85 ఏళ్ల వయసున్న మాజీ శాస్త్రవేత కరోనా మహమ్మారితో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వము పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.