పోలీస్ అధికారులు, సిబ్బందికి టీకాలు ఇప్పించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర రాజధానిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో 97 శాతం మందికి ఇప్పటికే టీకాలు వేయించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 94.6 శాతం మంది, సైబరాబాద్ కమిషనరేట్‌లో 97.8, రాచకొండ కమిషనరేట్‌లో 98.3 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు.
Corona Vaccine: పోలీసు శాఖలో ఫలిస్తున్న టీకా మంత్రం - తెలంగాణ పోలీసులు
కరోనా తొలి దశలో లాక్‌డౌన్ అమలులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు, సిబ్బంది వేల సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. రెండో దశ ఉద్ధృతంగా ఉండటంతో మహమ్మారి బారి నుంచి వారిని కాపాడేందుకు టీకాల ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసేలా ఠాణాల వారీగా కార్యాచరణను రూపొందించారు.
Corona Vaccine: పోలీసు శాఖలో ఫలిస్తున్న టీకా మంత్రం
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 6,800 మంది పోలీసుల కుటుంబ సభ్యులకూ తొలి డోసు ఇప్పించారు. టీకాలతో ఫలితమూ కనిపిస్తోంది. తొలి దశలో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 83 మంది పోలీసులు మృతిచెందగా.. రెండో దశలో ఇప్పటివరకు మరణాలు 9కే పరిమితమయ్యాయి.
ఇదీ చూడండి:నడుస్తున్న రైలులో యువతి హత్య