తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నలారా...తమ్ముల్లారా దండం పెడతా...బయట తిరగొద్దు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కవులు తమ కలాలకు పని చెబుతున్నారు. రచయితలు తమ మేధస్సుకు పదును పెడుతూ కరోనా మీద ప్రజలకు అవగాహన కలిగించడం కోసం పాటలు రాస్తున్నారు.

కరోనా వైరస్ నివారణకు రచయితల గళం
కరోనా వైరస్ నివారణకు రచయితల గళం

By

Published : Mar 30, 2020, 9:39 PM IST

కరోనా మహమ్మారి నివారణకు రచయితలు తమ గళం విప్పుతున్నారు. ఎంత చెప్పినా వినకుండా... నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న జనాలను బయటకు వెళ్లొద్దంటూ వేడుకుంటున్నారు. అన్నలారా... తమ్ముల్లారా జర వినండి.. నీకు దండం పెడుతారా అంటూ గేయాన్ని ఆలపించారు. కరోనాను కట్టడి చేయాలంటే మనిషికి మనిషికి దూరం పరిశుభ్రత అవసరం అంటూ పాడారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని గళం విప్పారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి మానవాళి క్షేమంగా బయటపడాలంటే బయటకు రాకండని శేఖర్ పగిళ్ళ పాట రూపంలో సూచించారు. దయచేసి ఇల్లు వదిలి ఎవరూ బయటకు రావొద్దని వేడుకున్నారు.

కరోనా వైరస్ నివారణకు రచయితల గళం

ABOUT THE AUTHOR

...view details