తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ హైదరాబాద్​ను కలవరపెడుతోన్న కరోనా - హైదరాబాద్​లో కరోనా

భాగ్యనగరాన్ని కరోనా వణికిస్తోంది. శుక్రవారం 774 కేసులు నమోదు కావడం వల్ల నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. మీర్‌పేటలో ఒకే కుటంబంలోని 12 మందికి వైరస్​ సోకింది. కాలనీల్లో కొత్తగా నమోదవుతోన్న కరోనా కేసులతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వైర‌స్ తీవ్ర రూపు దాలుస్తుండటంతో జంటనగరాల్లోని అనేక మార్కెట్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.

corona situation in hyderabad
గ్రేటర్​ హైదరాబాద్​ను కలవరపెడుతోన్న కరోనా

By

Published : Jun 27, 2020, 9:20 PM IST

జంటనగ‌రాల్లో క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. మౌలాలి పరిధిలోని మారుతినగర్​లో 60 ఏళ్ల వృద్ధురాలు వైరస్​తో మృతి చెందారు. నగర శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఓ బ్యాంకు ఉద్యోగికి కొవిడ్​ పాజిటివ్ వచ్చింది. ఇంటర్ బోర్డు కార్యాల‌యంలో ఓ అధికారికి, ఇద్దరు సిబ్బందికి వైరస్ సోకింది. ఇప్పటి వ‌ర‌కు ఇంట‌ర్ బోర్డులో ఆరుగురికి కరోనా నిర్ధరణ అయింది.

ఆరోగ్య సిబ్బందికి కూడా

బాలాపూర్ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ న‌ర్సు, ముగ్గురు ఆశా వ‌ర్కర్లకు వైరస్​ సోకింది. ఆరోగ్య కేంద్రంలో ఐదు రోజుల పాటు సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రక‌టించారు. హోం మంత్రి వ‌ద్ద ఎస్కార్టు విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్​కు క‌రోనా పాజిటివ్ వచ్చింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. అంబర్​పేట నియోజకవర్గ పరిధిలో 36 మందికి వైరస్​ సోకింది. కాచిగూడ డివిజన్​లో ఇద్దరు, గోల్నాక తులసినగర్​లో ఒక‌రు కరోనాతో మ‌ర‌ణించారు. అంబర్‌పేట్ పోలీస్ క్వార్టర్స్ 6వ బ్లాక్​లో ఇద్దరు కానిస్టేబుల్స్​కు పాజిటివ్ నిర్ధరణయింది.

త‌హ‌సీల్దార్ చంద్రక‌ళ‌కు కరోనా

ఆజాద్​నగర్​లో ఒకే కుటుంబంలో ముగ్గురికి వైరస్​ సోకింది. కాచిగూడ డివిజన్ పరిధిలో ఒక కుటుంబంలో ముగ్గురు వృద్ధులకు పాజిటివ్ వచ్చింది. షంషేర్​బాగ్​లో భార్య భర్తలతోపాటు ఏడేళ్ల బాబుకి కొవిడ్​ నిర్ధరణయింది. అమీర్​పేట్ త‌హ‌సీల్దార్ చంద్రక‌ళ‌కు వైరస్​ సోకింది. తహసీల్దార్​ కార్యాల‌యాన్ని బ‌ల్దియా సిబ్బంది శానిటైజేష‌న్ చేశారు. మిగ‌తా సిబ్బందికి క‌రోనా ప‌రీక్షలు చేయించారు. యూసుఫ్​గూడ సర్కిల్ 19, వెంగళరావునగర్ డివిజన్​లో 2, యూసుఫ్​గూడ డివిజన్​లో 2, ఎర్రగడ్డ డివిజన్​లో 1, రహ్మత్​నగర్ డివిజన్​లో 3, బోరబండ డివిజన్​లో ఇద్దరు వైరస్​ బారిన పడ్డారు.

ఒకే కుటుంబంలో 12 మందికి క‌రోనా

మీర్​పేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఒకే కుటుంబంలో 12 మందికి క‌రోనా సోకిన‌ట్లు క‌మిష‌న‌ర్ సుమ‌న్ రావు తెలిపారు. ఇదే కుటుంబంలో 10 రోజుల క్రితం వృద్ధుడు క‌రోనాతో మృతిచెందాడ‌ని, ఇప్పుడు ఆయనతో సంబంధం ఉన్న 12 మందికి కొవిడ్​ సోకిందని చెప్పారు. ఇటీవల కరోనా సోకిన నటుడు ప్రభాకర్​తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా ప‌రీక్షల్లో నెగిటివ్​గా వ‌చ్చినట్లు తెలిసింది. వెస్ట్​మారేడ్​ప‌ల్లిలో ఓ మ‌హిళ, ఆమె ఇద్దరు పిల్లలకు క‌రోనా నిర్ధర‌ణ అయింది.

స్వచ్ఛంద లాక్​డౌన్​

కేసులు క్రమంగా పెరుగుతుండ‌డం వల్ల న‌గ‌రంలోని ప్రధాన మార్కెట్లలోని వ్యాపారులు వారం పాటు స్వచ్ఛంద లాక్​డౌన్ విధించుకున్నారు. శనివారం నుంచి వారం రోజుల పాటు కోఠిలోని ట్రూప్​బ‌జార్​లో దుకాణాలు మూసివేస్తున్నారు. ఆదివారం నుంచి బేగంబ‌జార్, రాణిగంజ్, జ‌న‌ర‌ల్​బ‌జార్​తోపాటు వారం పాటు ప్రధాన మార్కెట్లు మూసివేయనున్నారు.

ఇదీ చూడండి:మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్‌

ABOUT THE AUTHOR

...view details