బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు కరోనా - corona positive for rs praveen kumar
14:01 August 10
కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
బహుజన సమాజ్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కరోనా బారినపడ్డారు. కొవిడ్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నందున.. తీసుకోవాల్సిన మందులు, ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఆయనకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఇటీవలే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) కండువా కప్పుకున్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్... ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి.. సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ప్రకటించారు.
ఇదీ చూడండి: RS PRAVEEN KUMAR: నల్గొండ సభలో బీఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్