తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్ఎంసీ మేయర్​కు మరోసారి కరోనా నెగిటివ్​

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్​కు కరోనా పరీక్షల్లో మరోసారి నెగిటివ్​ వచ్చింది. మేయర్ డ్రైవర్​కు కరోనా పాజిటివ్ రావడంతో... బొంతు రామ్మోహన్​కు వైద్యులు కొవిడ్​ వైద్య పరీక్షలు నిర్వహించారు.

Telangana corona updates
Telangana corona updates

By

Published : Jun 13, 2020, 5:00 PM IST

Updated : Jun 13, 2020, 6:17 PM IST

హైదరాబాద్‌ నగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్​కు కొవిడ్-19 వైద్య పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. ఇంతకుముందే పరీక్షలు చేయించుకోగా కరోనా లేదని తేలింది. రెండు రోజుల క్రితం మేయర్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ రావడం వల్ల రామ్మోహన్‌కు మరోసారి వైద్యులు శాంపిల్‌ తీసుకుని పరీక్షించగా... నెగెటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో మేయర్ కుటుంబసభ్యులతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Last Updated : Jun 13, 2020, 6:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details