చదవుకునేందుకు, కోచింగ్ తీసుకునేందుకు, ఉద్యోగాల రీత్యా వచ్చే యువతీ, యువకులు... కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లో ఉంటారు. వీటిని ఆసరా చేసుకుని చాలామంది వ్యాపారులు... చిన్న చిన్న వాణిజ్య సముదాయాలు, ఫుడ్‌కోర్టులు, హోటళ్లు నిర్వహిస్తూ జీవనాన్ని సాగించేవారు. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల కారణంగా నిర్వాహకులు వాటిని మూసివేసి సొంత గ్రామాలకు పయనమయ్యారు. పరిస్థితులు చక్కబడేంతవరకు సొంతూర్లో ఉండి... తర్వాత నగరానికి వద్దామనే కోణంలో ఇళ్లకు చేరుకున్నారు. దీంతో నిత్యం ప్రజల రద్దీతో కళకళలాడే సముదాయాలన్నీ... బోసిపోయి దర్శనమిస్తున్నాయి.
పరిస్థితి చక్కబడుతోందనే ఆశతో... ఇక్కడ ఉండలేక
కొవిడ్.. ప్రపంచాన్ని తన పంజాతో వణికిస్తోంది. లాక్డౌన్ సడలింపులు వచ్చినా సరే... చాలా మంది వైరస్ వేసిన శిక్ష నుంచి కోలుకోలేకపోతున్నారు. సరైనా వ్యాపారం లేక.. చాలా ఆశలతో నిర్మించుకున్న వ్యాపార సముదాయాలను వదిలి సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు.
పరిస్థితి చక్కబడుతోందనే ఆశతో... ఇక్కడ ఉండలేక