తెలంగాణ

telangana

ETV Bharat / state

పడిపోతున్న మద్యం విక్రయాలు.. రోజుకు పది కోట్ల మేర తగ్గుదల - corona updates in telangana

కొవిడ్​-19 ప్రభావం రోజువారీ మద్యం అమ్మకాలపై పడింది. ఫలితంగా విక్రయాలు తగ్గుతున్నాయి. సగటున రోజుకు రూ.70 కోట్ల విలువైన అమ్మకాలు జరిగితే.. ప్రస్తుతం రూ.55 కోట్లకు మించడం లేదు. 2019-20 ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు రూ.22,414 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది.

corona
పడిపోతున్న మద్యం విక్రయాలు.. రోజుకు పది కోట్ల మేర తగ్గుదల

By

Published : Mar 20, 2020, 6:10 AM IST

Updated : Mar 20, 2020, 9:41 AM IST

పడిపోతున్న మద్యం విక్రయాలు.. రోజుకు పది కోట్ల మేర తగ్గుదల

కరోనా ప్రభావం రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.22,414 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.3,414 కోట్ల అమ్మకాలు జరగ్గా.. హైదరాబాద్‌లో రూ.2,700 కోట్లు, మేడ్చల్‌, నల్గొండ జిల్లాల్లో సుమారు రూ.1,700 కోట్లు మేర అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంటే సగటున రోజుకు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరిగేవి. అయితే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం బార్లు, పబ్‌లు మూసివేయడం వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.

ఇప్పట్లో కోలుకోవు..

బార్లు, పబ్‌లు మూసివేత.. మద్యం అమ్మకాలపై భారీగా ప్రభావం చూపుతోందని అధికారులు తెలిపారు. గడిచిన కొన్ని రోజుల నుంచి సగటున రూ.55 కోట్లకు మించి అమ్మకాలు జరగడం లేదన్నారు. ఈ నెల 10న రూ.115 కోట్ల మేర అమ్మకాలు జరగ్గా... 11న రూ.86 కోట్లు, 14న రూ.82 కోట్లు, 16న రూ.99 కోట్ల లెక్కన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 17న రూ.68 కోట్లకు అమ్మకాలు పడిపోగా.. 18న రూ.56 కోట్లు, 19న రూ.55 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. కరోనా ప్రభావంతో రోజూవారీ విక్రయాలు రూ.10 కోట్ల మేర తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో తగ్గిన అమ్మకాలు ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదంటున్నారు.

ఇవీచూడండి:కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష: కేసీఆర్

Last Updated : Mar 20, 2020, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details