ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన కొవిడ్ నిర్ధరణ పరీక్షల్లో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 18, నెల్లూరులో 8 పాజిటివ్‌గా తేలినట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ బారిన పడి కోలుకున్న ఓ వ్యక్తి సోమవారం డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం ఆరుగురికి వ్యాధి నయమై ఇంటికి చేరినట్టు ప్రభుత్వం తెలిపింది.
జిల్లా | పాజిటివ్ కేసుల సంఖ్య |
నెల్లూరు | 42 |
కృష్ణా | 29 |
గుంటూరు | 32 |
కడప | 27 |
ప్రకాశం | 24 |
పశ్చిమ గోదావరి | 21 |
విశాఖపట్నం | 20 |
తూర్పు గోదావరి | 11 |
చిత్తూరు | 17 |
అనంతపురం | 06 |
కర్నూలు | 74 |
మొత్తం కేసుల సంఖ్య | 303 |
ఇద్దరి మృతిపై అధికారిక ప్రకటన