ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో.. కొత్తగా 1,184 కరోనా కేసులు నమోదవ్వగా... నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఒకరిని వైరస్.. బలితీసుకుంది. తాజాగా మరో 456 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,338 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 901989 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 30,964 కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో.. ఏపీ వ్యాప్తంగా 1,184 మందికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నలుగురిని కొవిడ్ మహమ్మారి బలితీసుకుంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 901989 మంది వైరస్ బారిన పడ్డారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 1,50,83,179 శాంపిల్స్‌ను పరీక్షించారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 352 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. విశాఖ జిల్లాలో 186, చిత్తూరు జిల్లాలో 115, కృష్ణా జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 78, అనంతపురం జిల్లాలో 66, కర్నూలు జిల్లాలో 64, కడప జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 47, ప్రకాశం జిల్లాలో 45, తూర్పుగోదావరి జిల్లాలో 26, విజయనగరం జిల్లాలో 19, పశ్చిమగోదావరి జిల్లాలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:కరోనా వ్యాప్తి దృష్ట్యా అప్రమత్తత అవసరం: ఈటల