ఏపీలో గడిచిన 24 గంటల్లో 78,784 పరీక్షలు నిర్వహించగా.. 2,107 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19,62,049 మంది వైరస్ బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
AP corona cases: ఏపీలో కొత్తగా 2,107 కరోనా కేసులు - ఏపీలో కొత్తగా కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,107 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 19,62,049కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కేసులు
కరోనాతో కృష్ణాలో నలుగురు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ఈ మహమ్మారి కారణంగా తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. అలాగే వైఎస్ఆర్ కడప, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొ క్క రు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండీ:Etela: 'కేసీఆర్ చేసిన అవమానాలు భరించలేకే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు'