తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కరోనా

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల రెండకెల్లో నమోదవుతూ వస్తున్న కేసులు... ఇప్పుడు మూడంకెలకు చేరుకుంది. మహమ్మారి ప్రభావం తగ్గిపోయిందని భావిస్తున్న వేళ... కొత్త రూపు సంతరించుకుని మళ్లీ వేగంగా వ్యాప్తిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో కొవిడ్‌ ఉద్ధృతమవడంతో... ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమయింది. పరీక్షల సంఖ్య పెంచడం సహా సరిహద్దు జిల్లాల్లో కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేసింది.

corona cases has been increasing in telangana
రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కరోనా

By

Published : Feb 24, 2021, 7:28 AM IST

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కరోనా

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుండడం పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు... వైరస్‌ ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌లు విధించడం సహా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనూ కొత్త రకం కరోనా కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తుండడంతో.... వైద్యారోగ్యశాఖ ముందస్తు నివారణ చర్యలపై దృష్టిసారించింది. పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. కొవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించింది.

దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న వైరస్​

దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న కొత్త రకం కరోనా ఎన్-440కే, డబ్ల్యూ484కే స్ట్రెయిన్ల ఉనికి తెలంగాణలోనూ ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ప్రజలు కొవిడ్‌ నిబంధనలను విస్మరిస్తుండడం వల్ల కొవిడ్‌ కేసులు పెరుగుతున్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో సుమారు 37 మంది వైరస్ బారిన పడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని ఓ టోల్‌గేట్‌లో పనిచేసే సిబ్బందికి సైతం కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించింది. టిమ్స్, గాంధీ, నిమ్స్ సహా అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోనూ సౌకర్యాలను మెరుగుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

నిర్లక్ష్యం వద్దు

గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల్లో పెరుగుదల ఉన్నా... ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. మాస్కులు ధరించడం, శానిటైజర్‌ల వాడకం, భౌతికదూరం పాటించడం వంటి నియమాలతో వైరస్‌ను కట్టడి చేయవచ్చని తెలిపింది. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా వ్యవహరించి... తమ వంతు వచ్చినప్పుడు టీకాలు తీసుకోవాలని కోరింది.

ఇదీ చదవండి:విద్యార్థి స్థాయిలోనే ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే 'నవం'శకం

ABOUT THE AUTHOR

...view details