తెలంగాణ

telangana

By

Published : May 1, 2020, 8:02 AM IST

ETV Bharat / state

ఏపీలో మరో 71 మందికి కరోనా.. 1,403కు చేరిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత పది రోజుల్లో కొవిడ్‌-19 కేసులు విపరితంగా పెరిగాయి. కొత్తగా 71 పాటిజివ్‌ కేసులతో మెత్తంగా కేసులు సంఖ్యం 1403కు చేరింది. రాష్ట్రంలో నమోదైన మెత్తం కేసుల్లో దాదపు సగం కేసులు ఈ వ్యవధిలోనే పెరిగాయి.

corona-case-updates-in-andhra-pradesh
పది రోజుల్లోనే రెట్టింపు!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 10 రోజుల్లో కరోనా కేసుల ఉద్ధృతి పెరిగింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 71 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గురువారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403కు చేరింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెరుగుతోంది. తదనుగుణంగా కేసుల విస్తృతీ ఎక్కువవుతోంది.

ఏప్రిల్‌ 20 ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కేసులు 722. గడిచిన పది రోజుల్లోనే ఈ సంఖ్య 1,403కు చేరింది. రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన మొత్తం కేసుల్లో ఈ పది రోజుల్లో తేలినవే దాదాపు సగం (48.5 శాతం) ఉండటం గమనార్హం. ఏప్రిల్‌ 20 నాటికి 30,773 మందికి పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం వాటి సంఖ్య దాదాపు లక్షకు చేరువవుతోంది. గురువారం ఉదయం వరకు మొత్తం 94,558 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇంతవరకు మొత్తం 31 మంది మరణించారు. గురువారం నాటికి కొత్తగా 34 మంది కోలుకున్నారు. గుంటూరు జిల్లాలో 28 మంది, అనంతపురంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో వీరి సంఖ్య మొత్తం 321కి చేరింది.

కరోనా కేసుల పెరుగుదల ఇలా...
జిల్లాల వారీగా - కొత్త కేసులు

ఇదీ చూడండి:ప్రపంచంపై ఆగని కరోనా ప్రతాపం-రష్యాలో లక్ష కేసులు

ABOUT THE AUTHOR

...view details