హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో సరైన ధ్రువపత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
లంగర్‌హౌస్‌లో పోలీసుల నిర్బంధ తనిఖీలు - CORDON SEARCH
హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు పలు చోట్ల నిర్బంధ తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిర్బంధ తనిఖీలు...
తనిఖీల్లో ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలతో కలిపి మొత్తం 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 304 ఇళ్లు సోదా చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ పరిధిలోని ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఏసీపీ హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: కరెంటు వాడకం పల్లెల్లో తగ్గింది నగరాల్లో పెరిగింది
Last Updated : Apr 17, 2019, 8:05 AM IST