పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని బిలాల్ నగర్ పరిసర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 13 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.
నంబరు ప్లేటు విషయంలో కఠిన చర్యలు
సరైన ధ్రువపత్రాలు లేని 49 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల నంబరు ప్లేటు విషయంలో ఆర్టీవో కార్యాలయం జారీ చేసిన నిబంధనల ప్రకారం లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో చార్మినార్ ఏసీపీ అంజయ్య, చార్మినార్ ఏసీపీ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పాత బస్తీలో నిర్బంధ తనిఖీలు ఇదీ చదవండి: సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు