సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రక్షణ స్థలాల్లో హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ అక్కడే ఉన్న పార్కు స్థలాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పచ్చదనంతో నిండాల్సిన పార్కులు చెత్తతో దర్శనమిస్తున్నాయి. ఆహ్లాద వాతావరణంలో పిల్లలు ఆడుకోవాల్సిన పార్కులు వ్యర్ధాలతో నిండిపోయి ఉన్నాయి. కంటోన్మెంట్లోని పలు పార్కులో పరిస్థితి ఇదే విధంగా తయారైంది. చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలతో పార్కు నిండిపోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు బోర్డు సభ్యులు, సీఈఓ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. రాత్రి అయితే చాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని.. పార్కును ఆనుకొని పాఠశాల ఉన్నా కంటోన్మెంట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
వెలవెలబోతున్న కంటోన్మెంట్ పార్కులు - Parks
పచ్చదనంతో నిండాల్సిన పార్కులు చెత్తతో దర్శనమిస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రక్షణ స్థలాల్లో హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నా అక్కడే ఉన్న పార్కు స్థలాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
వెలవెలబోతున్న కంటోన్మెంట్ పార్కులు