మార్చి 22 నుంచి ఈనెల 16 వరకు మహిళల గృహ హింసకు సంబంధించి డయల్ 100 ద్వారా 522 ఫిర్యాదులు అందాయి. వెంటనే సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిర్యాదు రాగానే టెలీ కౌన్సెలింగ్ నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి - Domestic Violence Complaints
లాక్డౌన్ సమయంలో కూడా మహిళలు, భార్యలను వేధించే వారి సంఖ్య పెరుగుతోంది. అత్తమామల ఎత్తి పొడుపు మాటలు.. నాలుగు గోడల మధ్య నిత్యం నరకం అనుభవిస్తూ వేధింపులకు గురవుతున్నారు. పలు కారణాలతో 522 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. గృహహింస ఎదుర్కొనే మహిళలు నిర్భయంగా పోలీసులకు చెప్పాలని చెబుతున్నారు.
గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి
అక్కడ పరిష్కారం కాకపోతే షీ టీం బృందాలు రంగంలోకి దిగి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించి నిపుణులతో మాట్లాడిస్తున్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు. గృహ హింస ఎదుర్కొనే మహిళలు నిర్భయంగా డయల్ 100 లేదా 94906 17261 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి :నేటి అర్ధరాత్రి నుంచి టోల్ రుసుం వసూలు
Last Updated : Apr 20, 2020, 1:15 PM IST