కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లికి అడ్వాన్స్ డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కె.కె.కన్వెన్షన్ 7 బాంకెట్‌హాల్ తీరుపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. డబ్బు రూ.90 వేలు, కేసు ఖర్చులు రూ.5 వేలు, 45 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించింది. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన పటేల్ వెంకట మల్లారెడ్డి ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. తన చెల్లెలి పెళ్లి కోసం కన్వెన్షన్‌హాల్‌ను రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నాడు. కరోనాతో పెళ్లి వాయిదా పడింది. డబ్బు తిరిగి ఇవ్వాలని మల్లారెడ్డి.. కన్వెన్షన్ యాజమాన్యాన్ని కోరారు. ఇవ్వకపోవడంతో ఆయన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
కలర్స్‌కు జరిమానా..
బరువు తగ్గిస్తామంటూ అశాస్త్రీయ పద్ధతులతో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో కలర్స్ తీరును రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తప్పు పట్టింది. మియాపూర్‌కు చెందిన బాధితుడు సముద్రాల మహేందర్ చెల్లించిన రూ.28,500, 4 శాతం వడ్డీతో, కేసు ఖర్చులు రూ.3 వేలు, సికింద్రాబాద్‌కు చెందిన బాధితురాలు ఎం.లక్ష్మీరెడ్డికి రూ.23 వేలు, 6 శాతం వడ్డీతో రీఫండ్ చేయడంతో పాటు పరిహారం రూ.5 వేలు, కేసు ఖర్చులు రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.
ఏసీ మరమ్మతుల్లో పొరపాటు.. అర్బన్ కంపెనీకి రూ.లక్ష జరిమానా..