హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బారిన పడిన తనకు చికిత్స అందించిన వైద్యుడికి కరోనా సోకడంతో ప్లాస్మా దానం చేశాడు.
కానిస్టేబుల్ ప్లాస్మా దానం.. అభినందించిన కేటీఆర్ - Constable donated plasma.
హైదరాబాద్ చిలకలగూడ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ విజయ్ ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఓ వైద్యుడికి ప్లాస్మాదానం చేశాడు. దీనిపై మంత్రి కేటీఆర్, పోలీసు శాఖ అధికారులు విజయ్‌ని అభినందించారు.
constable-donated-plasma-at-hyderabad
చిలకలగూడ పీఎస్‌కు చెందిన విజయ్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఇటీవల కోలుకొని తిరిగి విధుల్లో చేరారు. జీఎస్ఎన్ రెడ్డి అనే వైద్యుడు కరోనా సోకడం వల్ల అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడం వల్ల ప్లాస్మా అందించాలని వైద్యులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న విజయ్.. ప్లాస్మా దానం చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్, పోలీసు శాఖ అధికారులు కానిస్టేబుల్ విజయ్‌ని అభినందించారు.
ఇదీ చూడండి:అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు