ఆ 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు - Congress complaint on 12 MLAs
10:20 January 06
బీఆర్ఎస్లోకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
Congress complaint on 12 BRS MLAs : ఓవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు దృష్టి సారించింది. గతంలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు ఫోకస్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, రామ్మోహన్ రెడ్డి, సంపత్ కుమార్ , గడ్డం ప్రసాద్, మల్లు రవి కలిసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకిచేరిన 12 మంది ఎమ్మెల్యేలపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్లో చేరి 12 మంది ఎమ్మెల్యేలు పొందిన ఆర్థిక, రాజకీయ లబ్ధిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి: