తెలంగాణ

telangana

ETV Bharat / state

​కాంగ్రెస్​ యురేనియం వ్యతిరేక  పోరాట కమిటీ ఏర్పాటు - Urenium

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. సీనియర్​ నేత వీహెచ్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ కమిటీని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రకటించారు.​

congress

By

Published : Sep 13, 2019, 4:55 PM IST



రాష్ట్రంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఉద్ధృతం చేయాలని హస్తం పార్టీనిర్ణయించింది. ఇటీవల జరిగిన కోర్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మన్​గా మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంత రావు, కన్వీనర్​గా నాగర్​కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, కో - కన్వీనర్​గా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిలతో కలిపి 16 మందితో కూడిన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ వైస్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నల్గొండ మాజీ జడ్పీ ఛైర్మన్ బాలు నాయక్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్​లు ఉన్నారు.

​కాంగ్రెస్​ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details