తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాహుల్​ గాంధీ మళ్లీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలి.. వి.హనుమంతరావు విజ్ఞప్తి' - రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్​ నేత వి.హనుమంతరావు సూచించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ జన్మదిన సందర్భంగా పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపణీ చేశారు.

congress-senior-leader-hanumanth-rao-about-rahul-gandhi
'రాహుల్​ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టాలి'

By

Published : Jun 19, 2020, 4:01 PM IST

కాంగ్రెస్‌ పార్టీలో మొద‌టి నుంచి ఉన్న నాయ‌కుల‌కు సరియైన గౌర‌వం లేద‌ని సీనియ‌ర్ నేత వి.హ‌నుమంతురావు ఆరోపించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకొని.. హైదరాబాద్‌ అంబర్‌పేటలో తన నివాసం వద్ద పేదలకు, పారిశుద్ధ్య కార్మికుల‌కు దుప్పట్లు పంపిణీ చేశారు. రాహుల్​ గాంధీ తిరిగి ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details