తెలంగాణ

telangana

ETV Bharat / state

మండలి బరిలో! - కాంగ్రెస్​ నేత

శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఎంపిక చేసింది.

ఎమ్మెల్సీ

By

Published : Feb 26, 2019, 9:27 PM IST

Updated : Feb 26, 2019, 10:14 PM IST

మండలి బరిలో జీవన్​రెడ్డి
కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జీవన్ రెడ్డి బరిలో దిగనున్నారు. ఇవాళ జరిగిన ఎన్నికల కమిటీ భేటీలో జీవన్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు. అధికారికంగా రేపు ప్రకటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జీవన్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు పడతాయని హస్తం నేతలు భావిస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాలపై ఆయనకు గట్టి పట్టు ఉండటం కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి బరిలో నిలిచిన జీవన్ రెడ్డి... తెరాస అభ్యర్థిపై అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.

Last Updated : Feb 26, 2019, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details