తెలంగాణ

telangana

ETV Bharat / state

పోతిరెడ్డిపాడుపై పోరాటానికి ప్రత్యేక కమిటీ: ఉత్తమ్

పోతిరెడ్డిపాడుపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధమౌతోంది. అందుకు ప్రణాళికలను రచించి 12 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో వ్యతిరేక ఉద్యమం కొనసాగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

congress ready to fight against pothireddypadu
congress ready to fight against pothireddypadu

By

Published : Jun 9, 2020, 7:01 PM IST

తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. చైర్మన్‌గా మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉంటారని ఆయన పేర్కొన్నారు. వీరితోపాటు 12 మంది కమిటీ సభ్యులను ప్రకటించారు.

ఈ కమిటీకి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్‌ వి.హనుమంతరావు సలహాదారులుగా ఉంటారని తెలిపారు. మాజీ మంత్రులు చిన్నా రెడ్డి, సంభాని చంద్రశేఖర్, గడ్డం ప్రసాద్, మాజీ ఎంపీలు మల్లు రవి, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్మన్ బాలు నాయక్, నాయకులు లింగారెడ్డి, శ్రీహరి ముదిరాజ్, రామలింగయ్య యాదవ్, దొంగరి వెంకటేశ్వర్లు, సిహెచ్​.ఎల్​.ఎన్ రెడ్డి, తదితరులు సభ్యులుగా ఉంటారని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వివరించారు.

ఇదీ చూడండి :'విద్యుత్‌ డిస్కంలు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details