హైదరాబాద్లోని డిడి కాలనీలో కబ్జాలకు గురవుతున్న ఓయూ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అక్రమ నిర్మాణాలపై నిరసన వ్యక్తం చేశారు. వీరితో పాటు పలు విద్యార్థి సంఘం నేతలు అక్కడకు చేరుకున్నారు.
ఓయూ ప్రహరీ గోడ వద్ద స్థలంలో నిర్మాణంపై కాంగ్రెస్ నిరసన - కాంగ్రెస్ నేతల ధర్నా
ఓయూ ప్రహరీ గోడ వద్ద స్థలంలో నిర్మాణంపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క, వీహెచ్ ఆరోపించారు.
ఓయూ ప్రహరీ గోడ వద్ద స్థలంలో నిర్మాణంపై కాంగ్రెస్ నిరసన
ఓయూ భూముల ఆక్రమణను అడ్డుకుంటామని ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల రాకను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చూడండి:'లాక్డౌన్తో లాభం లేదు- ఇంకా చాలా వ్యూహాలున్నాయి'