హైదరాబాద్ కూకట్పల్లి డివిజన్ ప్రగతినగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రహదారి పక్కన ఉన్న భవనాన్ని తెరాస నాయకుడు లక్ష్మీ నారాయణ జేసీబీ సాయంతో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న హస్తం నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకునే క్రమంలో గొడవ మొదలైంది. కూల్చిన చోటే కొత్తది నిర్మించాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు . తెరాస నాయకుణ్ని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేతపై ఉద్రిక్తత - కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
కూకట్పల్లిలోని ప్రగతినగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. హస్తం నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ కార్యాలయం కూల్చివేత
కార్యాలయం కూల్చివేతతో ఉద్రిక్త పరిస్థితులు
ఇదీ చదవండి : దీక్షను విరమించిన లక్ష్మణ్... రేపు డిశ్ఛార్జ్...