ముఖ్యమంత్రి కేసీఆర్ ఆబ్కారీ శాఖ పేరును... మద్యం ప్రోత్సాహక శాఖగా పేరు మారిస్తే బాగుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచారని... తెలంగాణలో కూడా ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించిన ఆయన... ఏపీలో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించారని ఇక్కడ ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నేరాలు పెరగడానికి, మహిళలపై అఘాయిత్యాలు అధికం కావడానికి విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలేనని ఆరోపించారు.
'మద్యం ధరలు పెంచడం కాదు... షాపుల సంఖ్య తగ్గించండి'
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం దురదృష్టకరమని వెల్లడించారు. రాష్ట్రంలో నేరాలు పెరగడానికి, మహిళలపై అఘాయిత్యాలు అధికం కావడానికి విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలేనని ఆరోపించారు.
రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మద్యం అమ్మకాలు విస్తరించడం ద్వారా రాబడిని పెంచుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మద్యం ద్వారా రాష్ట్రానికి 25వేల కోట్ల రూపాయల రాబడి వస్తోందని, మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం దురదృష్టకరమన్నారు.
మద్యంతో ప్రజలపై పడే భారం.. రాష్ట్ర బడ్జెట్లో సగంగా కేసీఆర్ భావిస్తున్నారా అని నిలదీశారు. ప్రభుత్వ విధానాలు మద్యపానం ప్రోత్సహకంగా ఉన్నాయని... ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే... బెల్ట్ షాపులని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
- ఇవీ చూడండి: యాదాద్రిలో కేసీఆర్... ఆలయ పనుల పురోగతిపై ఆరా...
TAGGED:
CONGRESS MLC JEEVAN REDDY