రాజ్యంగబద్ధమైన సీఎం పదవిని కేసీఆర్ అగౌరవ పరుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే కేసీఆర్ సీఎం అయ్యారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్‌కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం పదవిలో ఉండే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు: జీవన్ రెడ్డి
సీఎం పదవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా కేసీఆర్‌కు పదవిలో ఉండే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే ముఖ్యమంత్రి అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిపై చేసినా వ్యాఖ్యలపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.
దిల్లీలో ఆలయ్బలయ్ అంటూ, రాష్ట్రంలో విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. గులాబీ కారు మోదీ నడుపుతున్నారో లేక కేసీఆర్ నడుపుతున్నారో చెప్పాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ అవినీతిని బయట పెట్టేందుకు కేంద్రం ఎందుకు వెనకాడుతోంది. తెలంగాణను దోచుకునేందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం. సీఎంగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌పై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. గిరిజనులకు సంబంధించిన పోడు భూముల హక్కులపై పోరాడుతాం. - జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ