పట్టభద్రుల ముందు తెరాస ప్రభుత్వం దోషిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఆరోపించారు. అందుకే ఉద్యోగాల విషయంలో కాకిలెక్కలు చెబుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సీఎం కేసీఆర్ పేర్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
మూడు నెలల్లో లక్షా 91 వేల ఉద్యోగాలకు కృషి చేస్తాం: చిన్నారెడ్డి - తెలంగాణ వార్తలు
పీవీ నరసింహారావు, సీఎం కేసీఆర్ పేర్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఆరోపించారు. పట్టభద్రుల ముందు దోషిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తనను గెలిపిస్తే మూడు నెలల్లో లక్షా 90వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
మూడు నెలల్లో లక్షా 91 వేల ఉద్యోగాలకు కృషి చేస్తాం: చిన్నారెడ్డి
తనకు ఓటేసి గెలిపిస్తే... మూడు నెలల్లో లక్షా 91 వేల ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ప్రగతిభవన్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి:డిజిటల్ డీటాక్స్... ఆ అలవాటును నియంత్రించుకోలేకపోతున్నారా?