తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం​ ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్​ సభ్యులు.. ఆరుగురిపై వేటు - congress mla komatireddy rajagopal reddy

తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశలో కాంగ్రెస్‌ ముందుకెళ్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ శాసన సభ్యులు తూర్పారబట్టారు. రేవంత్‌ రెడ్డి అరెస్ట్​ను తప్పుబట్టారు. ఇలా కేసీఆర్​ ప్రసంగాన్ని అడ్డుకున్న ఆరుగురు కాంగ్రెస్​ నేతలను స్పీకర్​ సస్పెండ్​ చేశారు. ప్రశ్నిస్తే సస్పెండ్​ చేస్తారా అంటూ హస్తం​ నేతలు మండిపడ్డారు. గులాబీ నాయకుల అక్రమాలు, అవినీతి కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

congress mlas suspend from house
సీఎం​ ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్​ సభ్యులు

By

Published : Mar 8, 2020, 5:24 AM IST

Updated : Mar 8, 2020, 8:36 AM IST

సీఎం​ ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్​ సభ్యులు

అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అధికార తెరాస, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మార్క్‌ఫెడ్‌ ఎన్నికల్లో తమ పార్టీ డీసీసీబీ డైరెక్టర్‌ను నామినేషన్‌ వేయనియకుండా.. మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అసభ్యకర పదజాలంతో దూషించారని కాంగ్రెస్‌ శాసన సభ్యులు ఆరోపించారు.

ఈ సంఘటనపై సమాధానం చెప్పాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగాన్ని కాంగ్రెస్​ నేతలు అడ్డుకున్నారు. ఆరుగురు శాసనసభ్యులు భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పోదెం వీరయ్య, రాజగోపాల్‌ రెడ్డిని స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి సభ నుంచి సస్పెండ్‌ చేశారు

ఎంపీ రేవంత్‌ రెడ్డి

జన్వాడ వద్ద 111 జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలను.. చిత్రీకరించేందుకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి తన అనుచరులతో వెళ్లారని హస్తం నేతలు చెప్పారు. డ్రోన్‌ కెమెరాలు వాడారని పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్​ను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఆ నిర్మాణాలు మంత్రి కేటీఆర్‌కు చెందినవి కాకుంటే ఎందుకు పోలీసులు అక్కడ కాపలా ఉంటారని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేల అరెస్ట్​

అనంతరం 111 జీవోకు వ్యతిరేకంగా జన్వాడ వద్ద జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధరబాబు, పొదెం వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డిలు వెళ్లారు. మార్గమధ్యలోనే కోకాపేట సబితానగర్‌ కూడలి వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతం నిషేధిత ప్రాంతమని.. అక్కడికి వెళ్లడానికి వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. జన్వాడ వద్ద ఉన్న ఫామ్‌ హౌస్‌తో కేటీఆర్‌కు సంబంధం లేకుంటే.. 111జీవోకు వ్యతిరేకంగా జరుగుతున్న నిర్మాణాలను ఎందుకు కూల్చేయలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు.

ఇదీ చూడండి:అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు

Last Updated : Mar 8, 2020, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details