హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ నెల 9న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు సబితా రెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
అత్యవసర సమావేశం - kuntiya
రాహుల్ గాంధీ ఈ నెల 9న తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశమయ్యారు.
సమావేశానికి హాజరు అవుతున్న నేతలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోకసభ నియోజకవర్గంలో బహిరంగసభ ఏర్పాటు చేయాలన్న కోణంలో చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ పర్యటనకు ఎంత మందిని తరలించాలి... ఎవరిని ఆహ్వానించాలి... ఏర్పాట్లు ఏలా ఉండాలి అన్న అంశాలపై నేతలు సమీక్షించారు.
ఇవీ చూడండి:త్వరలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్
Last Updated : Mar 5, 2019, 3:55 PM IST