బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బీఏసీ భేటీలో ఎవరు పాల్గొనాలి, బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై సమాలోచన జరపనున్నట్లు చెప్పారు.
ఇవాళ సమావేశం కానున్న కాంగ్రెస్ శాసనసభాపక్షం - telangana varthalu
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది. ఇవాళ్టి నుంచి మొదలుకానున్న బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
ఇవాళ సమావేశం కానున్న కాంగ్రెస్ శాసనసభాపక్షం
కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని సభాపతిని కోరనున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదల సహా ప్రజాసమస్యలను సభలో లేవనెత్తాలని సీఎల్పీ భావిస్తోంది.
ఇదీ చదవండి: ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా