తెలంగాణ

telangana

ETV Bharat / state

BHARAT BANDH: ''భారత్​ బంద్'​ను విజయవంతం చేయాలని కాంగ్రెస్​ విజ్ఞప్తి.. తెతెదేపా మద్దతు' - telangana latest news

అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్​ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ప్రజల కోసం చేస్తున్న ఈ బంద్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బంద్​కు తెతెదేపా పూర్తి స్థాయిలో మద్దతిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన స్పష్టం చేశారు.

BHARAT BANDH: ''భారత్​ బంద్'​ను విజయవంతం చేయాలని కాంగ్రెస్​ విజ్ఞప్తి.. తెతెదేపా మద్దతు'
BHARAT BANDH: ''భారత్​ బంద్'​ను విజయవంతం చేయాలని కాంగ్రెస్​ విజ్ఞప్తి.. తెతెదేపా మద్దతు'

By

Published : Sep 26, 2021, 5:20 PM IST

Updated : Sep 26, 2021, 7:41 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్​ను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవిలు కోరారు. ఇది రాజకీయం కోసం చేస్తున్న బంద్​ కాదని.. ప్రజల కోసం చేస్తున్న బంద్​ అని తెలిపారు. ఈ భారత్​ బంద్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 గంటలకు ఉప్పల్ బస్ డిపో వద్ద రేవంత్​రెడ్డి భారత్​ బంద్‌లో పాల్గొంటారు.

ఈ సందర్భంగా డీసీసీలు, నియోజకవర్గ బాధ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు ఎవరికి కేటాయించిన ప్రాంతాల్లో వారు బంద్‌ను సక్సెస్ చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని సూచించారు.

తెరాస మద్దతు తెలపాలి..

భారత్ బంద్​ను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ నివాసంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజల కోసం చేపట్టే ఈ భారత్ బంద్​కు తెరాస సైతం మద్దతు పలకాలని జీవన్​రెడ్డి సూచించారు. బంద్​కు ముందుకు రాకపోతే.. తెరాస, భాజపాలు కలిసి

ప్రజలను మోసం చేస్తున్నట్లుగా భావించక తప్పదన్నారు.

తెదేపా పూర్తిస్థాయి మద్దతు..

మరోవైపు రేపటి భారత్​ బంద్​కు తెలంగాణ తెదేపా పూర్తి స్థాయిలో మద్దతిస్తుందని తెదేపా సీనియర్​ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకోవటంలో తెరాస ప్రభుత్వం విఫలమవుతోందన్న ఆమె.. దిల్లీ పెద్దలతో చర్చించేందుకు వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్ రైతుల సమస్యలపై ఎందుకు చర్చించటం లేదని మండిపడ్డారు. శాసనసభ సమావేశాల సమయంలోనూ రైతు సమస్యలను చర్చించటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కాట్రగడ్డ ప్రసూన.. రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్​ మద్దతు..

సెప్టెంబరు27న 'భారత్‌ బంద్‌'(Bharat bandh) పాటించాలని రైతులు ఇచ్చిన పిలుపునకు మద్దతిస్తామని కాంగ్రెస్‌ ఇదివరకే ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ పేర్కొన్నారు.

ఆమ్​ ఆద్మీ మద్దతు..

సాగు చట్టాలు రద్దు చేయాలని కోరుతూ.. సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఇచ్చిన భారత్‌ బంద్‌(farmers agitation bandh) పిలుపునకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చడ్డా శనివారం తెలిపారు.

ఏపీ మద్దతు..

రైతుచట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్​కు ఏపీ ప్రభుత్వం మద్దతునిస్తుందని ఆ రాష్ట్ర​ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం 27 అర్ధరాత్రి నుంచి 28 మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. రైతుచట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా భారత్‌ బంద్​కు మద్దతునిస్తున్నామని తెలిపారు.

సంబంధిత కథనాలు..

27న రైతుల 'భారత్‌ బంద్‌'- కాంగ్రెస్​ మద్దతు

Bharat bandh ycp support: భారత్ బంద్​కు వైకాపా మద్దతు

Bharath Bandh: భారత్‌ బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలి: అఖిలపక్ష నేతలు

Last Updated : Sep 26, 2021, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details