తెలంగాణ

telangana

ETV Bharat / state

కేెంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ధర్నా

congress protest: పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాద్ ఎల్బీనగర్​లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గ్యాస్‌ సిలిండర్లకు పూలదండలు వేసి నిరసన వ్యక్తం చేశారు.

congress protest
కాంగ్రెస్ నిరసన

By

Published : Mar 31, 2022, 3:55 PM IST

congress protest: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఎల్బీ‌నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు మల్ రెడ్డి రాంరెడ్డి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్యాస్‌ సిలిండర్లకు పూలమాలవేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలు గుండు గీయించుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్డుపైన వంటవార్పు

పేద ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయని కాంగ్రెస్ నేత మల్​రెడ్డి రాంరెడ్డి ఆరోపించారు. ఓ వైపు రైతుల బతుకులు రోడ్డున పడేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయని ఆయన విమర్శించారు.

మీర్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ నేత సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి గ్యాస్ సిలిండర్లకు పూలదండలు వేసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైన వంటావార్పు చేపట్టారు.

అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఏఈకి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, మహిళలు, పాల్గొన్నారు.

ఇదీ చదవండి:DH Srinivasrao On Heatwave: 'రాష్ట్రంలో హీట్​వేవ్... అందరూ బీ అలెర్ట్'

ABOUT THE AUTHOR

...view details