పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం 203 జీవో జారీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. 40వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచినట్లయితే దక్షిణ తెలంగాణ జిల్లాలన్నీ ఏడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో నల్లరిబ్బన్లను చేతులకు కట్టుకుని దీక్షలో కూర్చొన్నారు.
పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ సమరం.. గాంధీభవన్‌లో దీక్ష ప్రారంభం - గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల నిరసన దీక్ష
పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ సామర్థ్యం పెంపును నిరసిస్తూ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెరాస సర్కార్ వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల నిరసన దీక్ష
మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతు రావు, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, చిన్నారెడ్డి, వంశీచందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, వంశీ కృష్ణ తదితరులు దీక్షలో కూర్చొన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో 203ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు రాజకీయ పోరాటంతో పాటు.. న్యాయ పోరాటాలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
Last Updated : May 13, 2020, 12:56 PM IST