తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలను చూసే ప్రతిపక్షాల నుంచి నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని రహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 200మంది కార్యకర్తలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వనించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విమర్శించారు.
తెరాసలో చేరిన 200మంది కార్యకర్తలు - CONGRESS
తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన 12మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. అదే మార్గంలో కార్యకర్తలు కూడా గులాబీపార్టీలోకి వరస కట్టారు. హైదరాబాద్ రహమత్‌నగర్‌లో హస్తం పార్టీకి చెందిన 200మంది కార్యకర్తలను మంత్రి తలసాని, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కండువా కప్పి ఆహ్వనించారు.
తెరాసలో చేరిన 200మంది కార్యకర్తలు