తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేధావులంతా కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి...' - VH FIRE ON KCR

హైదరాబాద్​ చార్మినార్​ వద్ద రాజీవ్​గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవాన్ని కాంగ్రెస్​ పార్టీ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ కుంతియాతో పాటు సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేతలు... మేధావులంతా కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కోరారు.

CONGRESS LEADERS FIRE ON GOVERNMENT IN RAJIVGANDHI SADHBHAVAN YATRA MEETING

By

Published : Oct 19, 2019, 5:11 PM IST

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీసం 50 వేల ఉద్యోగాలు కూడా కల్పించని ప్రభుత్వం... 50 వేల ఆర్టీసీ కార్మికులను ఏ విధంగా తొలగిస్తారని కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు. హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద రాజీవ్​గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవాన్ని కాంగ్రెస్​ పార్టీ నిర్వహించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ కుంతియాతో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత వి. హనుమంతరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు పోవాలని నేతలు ఆకాంక్షించారు. ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. హైకోర్టు ఆదేశాలను సర్కారు పాటించాలని హితవు పలికారు. రాజీవ్ గాంధీ అవార్డ్ పొందినడా.గోపాల్ కిషన్ దేశ సేవ కోసం జీవితాంతం పనిచేశారని ఇలాంటి వైద్యులు ఇంకా ప్రజా సేవ చేయడం మంచి పరిణామమన్నారు. దేశ కోసం త్యాగం చేయడం కాంగ్రెస్ రక్తంలోనే ఉందన్నారు. మేధావులతో పాటు అన్ని వర్గాలు బయటకు వచ్చి కాపాడుకోకపోతే రాష్ట్రం ప్రమాదంలో పడడం ఖాయమని కాంగ్రెస్ ​నేతలు పేర్కొన్నారు.

'మేధావులంతా కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి...'

ABOUT THE AUTHOR

...view details