తహసీల్దార్ విజయారెడ్డి హత్య సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ హత్య వెనుక ఎవరెవరున్నారన్న వాస్తవాలు సీబీఐ విచారణతోనే బయటపడతాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో అనేక అవకతవకలు ఉన్నాయని... విజయారెడ్డి హత్య జరగడానికి అదే కారణమన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లనే విజయారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. తహసీల్దార్‌ను హత్య చేసిన సురేశ్... తెరాస కార్యకర్తేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ మాఫీయా పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీసు శాఖలో పారదర్శకత తీసుకురావాలంటే ఆయా శాఖల బృందాలను కర్ణాటక విధానాలపై అధ్యయనం చేయించాలని వీహెచ్ సూచించారు.
'ప్రభుత్వ పొరపాట్ల వల్లే విజయారెడ్డి హత్య'
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో అనేక అవకతవకలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదం వల్లే విజయారెడ్డి హత్య జరిగిందన్నారు. ఈ హత్యపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
CONGRESS LEADER VH ON MRO VIJAYA REDDY MURDER
ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు