నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్రం తలపెట్టిన యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బ తింటుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పవన్ కల్యాణ్‌ని కలిశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. యురేనియం తవ్వకాల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే పలువురు చెంచులు జనసేన పార్టీ దృషికి తీసుకొచ్చినట్లు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులతో మాట్లాడి ప్రజల్లోకి వెళ్తామని పవన్ స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించేది రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తామన్నారు. యురేనియం రెండు రాష్ట్రాల సమస్యని....యురేనియం శుద్ధి చేయగా వచ్చిన వ్యర్ధాలు కృష్ణా నదిలో కలవడం వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యం పాడవుతుందని వీహెచ్ అన్నారు. అన్ని పార్టీల నాయకులతో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామన్నారు.
యురేనియంపై ప్రత్యక్ష పోరాటానికి కాటమరాయుడు సై - pawan nu kalisina vh
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్‌కల్యాణ్ నల్లమలలో యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమని... ఈ విషయమై అఖిలపక్షంతో సమావేశం నిర్వహించి అనంతరం ప్రజల్లోకి వెళ్తామని జనసేన అధినేత తెలిపారు.
యురేనియంపై పోరాడదాం.. మాతో కలిసి రండి..