ఉద్యోగులకు వేతన సవరణ పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందన్న ఆయన... ఎన్ని ఆంక్షలు పెట్టినా కడుపు మండిన కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేశారన్నారు. గోల్నాక ఫంక్షన్ హాల్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రులు, అధికారులు వెళ్లకపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పని తక్కువ యాక్షన్ ఎక్కువైందని ఆక్షేపించారు.
ముఖ్యమంత్రి మైండ్‌గేమ్ ఆడుతున్నారు: వీహెచ్ - tsrtc strike
ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్‌గేమ్ ఆడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధ్వజమెత్తారు. సోనియా, రాహుల్‌లకు ఎస్పీజీ భద్రతను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి మైండ్‌గేమ్ ఆడుతున్నారు: వీహెచ్
ఎస్పీజీ భద్రతను తొలగించి గాంధీ కుటుంబం లేకుండా చేయాలని ఆరెస్సెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సోనియా, రాహుల్‌కు భద్రత పునరుద్ధరించకపోతే దేశం భగ్గుమంటుందన్నారు. వారికి ఏం జరిగినా మోదీ, అమిత్ షాలదే బాధ్యత అని అన్నారు. భాజపాను గెలిపించేందుకే మహారాష్ట్రకు వెళ్లి అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందని అసదుద్దీన్ అనడం విచారకరమని వీహెచ్ ఖండించారు.
ఇవీ చూడండి: ఇంకెన్ని రోజులు అనడం సిగ్గుచేటు: కోదండరాం