Congress Election Campaign Telangana 2023 :ఆరు గ్యారంటీలే ప్రచారాస్త్రాలుగా మార్చుకున్న హస్తం పార్టీ(Telangana Congress) గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తుండటంతో ఇతర పార్టీల అసంతృప్తులు సైతం హస్తం గూటికి చేరుతున్నారు. హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలో అభ్యర్థి కోట నీలిమ ఎన్నిక ప్రచారం నిర్వహించారు. కౌరవులైన ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి, అతని అనుచరులను ఓడించేందుకు పాండవులైనా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా ఐక్యంగా కదులుతున్నారని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదుయాష్కీ గౌడ్ అన్నారు. తమ ఐక్యత చూసి సుదీర్‌రెడ్డికి లాగులు తడుస్తున్నాయని ఆరోపించారు. చైతన్యపురిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్రెడ్డి రాంరెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
Madhu Yaskhi in Congress Election Campaign :ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సుదీర్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, గుండాలను వెంట పెట్టుకొని కాంగ్రెస్ నాయకులను, కాలనీ అధ్యక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సుదీర్‌రెడ్డి కబ్జాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాంరెడ్డి ఎంతో పోరాటం చేశారన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ఎల్బీనగర్ ప్రజలను కోరారు. ముషీరాబాద్‌లో ప్రచారం నిర్వహించిన అంజన్‌కుమార్ యాదవ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటిలోనూ 30 శాతం కమీషన్లు దండుకున్నారని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు