తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధు పథకానికి మెలికలు పెట్టడం తప్పు : భట్టి - Clp Leader Bhatti Vikramarkha Latest News

రాష్ట్ర వ్యాప్తంగా నియంత్రిత వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తోన్న ప్రభుత్వం..తాము చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు పథకం వర్తింపజేస్తామని చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.

చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామనడం తప్పు : భట్టి
చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామనడం తప్పు : భట్టి

By

Published : Jun 10, 2020, 6:53 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలనే కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతు ఇచ్చామన్న ఆయన పరీక్షలు తగినన్ని చేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంటల సాగు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తాము వ్యతిరేకించట్లేదని... తరతరాలుగా సాగుచేస్తున్న రైతన్నలను చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు వర్తిస్తుందని చెప్పడాన్ని తప్పుబడుతున్నామన్నారు. నియంత్రిత వ్యవసాయ విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

అసలే పనుల్లేవ్.. 3 నెలల విద్యుత్ బిల్లేంటి..

లాక్​డౌన్‌ కారణంగా ఉపాధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మూడు నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు. వివిధ ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఈ నెల 11న చలో సెక్రటేరియేట్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్‌ రెడ్డి ముఖాముఖి.

చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామనడం తప్పు : భట్టి

ఇవీ చూడండి : 'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'

ABOUT THE AUTHOR

...view details