తెలంగాణ

telangana

ETV Bharat / state

16న కాంగ్రెస్​ లోక్​సభ అభ్యర్థుల ప్రకటన? - congress

లోక్​సభ ఎన్నికలకు ప్రకటన రావటంతో రాష్ట్రంలోని  ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోన్నాయి. కాంగ్రెస్​ ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి... జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపింది. మంగళవారం సమావేశమైన స్క్రీనింగ్​ కమిటీ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. ఈ నెల 16 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

కుంతియా

By

Published : Mar 13, 2019, 6:22 AM IST

Updated : Mar 13, 2019, 8:40 AM IST

16న కాంగ్రెస్​ లోక్​సభ అభ్యర్థుల ప్రకటన?
రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఇంఛార్జీకార్యదర్శులు బోస్​రాజు, సలీం అహ్మద్​, శ్రీనివాసన్​ కృష్ణ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​, సీఎల్పీ నేత భట్టి హాజరయ్యారు. భేటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం రాగా మిగతా స్థానాల్లో రెండేసి పేర్లు పరిశీలిస్తున్నారు. తెరాసలో సీటు దక్కని ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్​లోకివస్తారని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

మరో అవకాశం?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి మళ్లీ సీటు ఇవ్వాలా వద్దా అనే అంశాంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్​, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్​, సురేశ్​ షెట్కార్​, రమేశ్​​ రాఠోడ్​, కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి పోటీ చేయగా రాజగోపాల్​ రెడ్డి ఒక్కరే గెలుపొందారు.పొన్నం ప్రభాకర్​, రమేశ్​ రాఠోడ్​లు బలమైన అభ్యర్థులుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

16న ప్రకటన

నేతల బలాలు, బలహీనతలపై చర్చించామని కుంతియా తెలిపారు. ఈ నెల 16న జాబితాకు తుదిరూపు ఇచ్చి కాంగ్రెస్​ ఎన్నికల కమిటీకి అందజేస్తామన్నారు. అదే రోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందన్నారు. తెరాస నుంచి ఇంతవరకు ఎవరూ కాంగ్రెస్​ అధిష్ఠానాన్ని సంప్రందించలేదని తెలిపారు.

ఇవీ చూడండి:హస్తంతో సబిత దోస్తీ వీడనుందా...?

Last Updated : Mar 13, 2019, 8:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details