జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. ఏ పోలింగ్ బూత్‌లో ఉందో తెలుసుకోవడానికి మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నా ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు గ్రేటర్ ప్రజలు. ఓటరు కార్డు నంబరుతో వెతికినా సమాచారం లభించకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.
గ్రేటర్ ఓటర్ల జాబితాలో గందరగోళం.... ప్రజలకు తప్పని అవస్థలు - జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
అసలే ఓటింగ్ శాతం తగ్గిపోతున్న బల్దియా ఎన్నికల్లో ఇప్పుడు మరో సమస్య ప్రజలకు ఎదురవుతోంది. గత ఎన్నికల్లో ఓటు వేసిన పోలింగ్ బూతుల్లో పేర్లు లేకపోవడంతో నానా పాట్లు పడుతున్నారు. మొబైల్ యాప్‌లో వెతికినా సమాచారం లభించడం లేదు. ఒకే కుటుంబసభ్యులకు వేర్వేరు పోలింగ్బూతులు కేటాయించడంతో ఓటేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
గ్రేటర్ ఓటర్ల జాబితాలో గందరగోళం....ప్రజలకు తప్పని అవస్థలు
గత ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లు అదే పోలింగ్ బూతుకు వస్తే ఓటు మరోచోట ఉందని చెప్పడంతో అవస్థలు పడ్డారు. కుటుంబసభ్యుల్లో వేర్వేరు పోలింగ్ బూతులు కేటాయించడంతో ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు. కొందిరికి రెండు ఓట్లు ఉండడంతో ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతోంది. ఒకే పేరుతో ఓటరుకు రెండు, మూడు చోట్ల ఓట్లు జాబితాలో పేర్లు నమోదయ్యాయి.